కొత్తగూడ: సిసి రోడ్డు పోయకుండానే బిల్లులు డ్రా

80చూసినవారు
యమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 14వ విడత సామాజిక తనిఖీలో సిసి రోడ్డు పోయకుండానే బిల్లులు డ్రా చేసి భారీ మొత్తం లో అవినీతి కి పాల్పడినట్లు సోమవారం వెలుగులోకి వచ్చింది.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సీ సి రోడ్డు, చంద్రు తండాలో మరొక సీ సి రోడ్డు పనులు చేయకుండానే డబ్బులు కాజేసిన సంఘటన మండలంలో హాట్ టాపిక్ గా మారింది. అక్రమార్కుల పై అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్