మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ గాంధీనగర్ వాగు సమీపంలో శుక్రవారం రాత్రిలడాయిగడ్డలోని కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్లుకు లారీలో తరలిస్తున్న ధాన్యం బస్తాలు కిందకు జారిపడిపోయాయి. సుమారు కిలోమీటరు దూరం వరకు పోయే లారీలోని ధాన్యం బస్తాలు జారీపడుతున్నట్లు డ్రైవరు గుర్తించలేదు. విషయం తెలుసుకున్న నిర్వాహకుడు ప్రత్యేక ట్రాలీ ఆటోలో వాటిని తీసుకెళ్లారు.