13 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం మహబూబాబాద్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు శుక్రవారం వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.