ఆదివాసి బిడ్డకు అరుదైన గౌరవం

4465చూసినవారు
ఆదివాసి బిడ్డకు అరుదైన గౌరవం
75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన పంద్రాగస్టు వేడుకలలో తాడువాయి జడ్పిటిసి బడే నాగజ్యోతి జాతీయ జెండాను ఎగరవేశారు. నిబంధనల ప్రకారం జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ పథకావిష్కరణ చేయాల్సి ఉన్నప్పటికీ 75 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివాసి నాయకురాలు కి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ తెలిపారు. చైర్మన్ ఆదేశాల మేరకు బడే నాగజ్యోతి పథకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలోచైర్మన్ జగదీష్, జిల్లాలోని జడ్పిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్