అబ్బాపూర్ క్రాస్ రోడ్ సమీపంలో బైక్ ఆటో ఢీ.. ముగ్గురికి గాయాలు

54చూసినవారు
అబ్బాపూర్ క్రాస్ రోడ్ సమీపంలో బైక్ ఆటో ఢీ.. ముగ్గురికి గాయాలు
ములుగు జాతీయ రహదారి జాకారంలోని అబ్బాపూర్ క్రాస్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామానికి చెందిన వారు మేడారం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బైక్ మితిమీరిన వేగంతో వచ్చి ఆటోను ఢీకొనడం వల్ల బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఆటోలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.