తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ప్రకృతితో మమేకమయ్యే సంబరం బతుకమ్మ పండుగ. కాగా ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు తొమ్మిది రకాల ప్రసాదాలను బతుకమ్మకు నివేదిస్తారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ అలంకరణ చేస్తారు. దీనికోసం రకరకాల పువ్వులు తీసుకొచ్చే బతుకమ్మగా పేరుస్తారు. ఈరోజు నువ్వులు, నూకలు లేదా బియ్యం, బెల్లంతో నైవేద్యం చేసి బతుకమ్మకు సమర్పిస్తారు.