ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జాతీయ రహదారి 163 పై శనివారం ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక లోడ్ తొ ఉన్న రెండు ఇసుక లారీలను ఏటూరునాగారం పోలీసులు సీజ్ చేశారు.
రాత్రి వేళల్లో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న లారీ డ్రైవర్ లు లారీలను జాతీయ రహదారి పై వదిలేసి వెళ్ళిపోయారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇసుక లారీలను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.