ములుగు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంగపేట మండలంలోని పలు ప్రాంతాల్లో కొత్తగా వర్షపు నీరు చేరడంతో కాలువలు, ఒర్రెల్లో స్థానికులు, మత్యకారులు మంగళవారం చేపలు పట్టడంలో బిజీ అయ్యారు. వలలు, చీరలతో చేపలు పట్టి ఇంటికి తీసుకెళ్తున్నారు. అయితే లోతు ఉన్నచోట చేపల వేటకు వెళ్లొద్దని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.