ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గల్ఫ్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని.. కేరళ మాదిరిగా గల్ఫ్ దేశాలకి వెళ్లే వారికి ముందస్తు నైపుణ్య శిక్షణ, అక్కడ కేసుల్లో చిక్కుకున్న వారికి న్యాయ, వైద్య సహయం అందించాలని.. గల్ఫ్ ఏజెంట్ల ఆగడాలను నియంత్రించడం వంటి చర్యలు తీసుకోవాలని గల్ఫ్ దేశాల్లోని తెలుగు సంఘాల నేతలు కోరుతున్నారు.