గాజాలో ఓ మ్యూజియంలో ఉన్న 3500 ఏళ్ల క్రితం నాటి మట్టి కుండను.. విజిట్‌కు వచ్చిన ఓ చిన్నారి పగలగొట్టేశాడు. ఈ ఘటన ఇజ్రాయిల్‌లోని హైఫా పట్టణంలో ఉన్న హెచ్ మ్యూజియంలో చోటుచేసుకున్నది. ఆ అరుదైన మట్టిపాత్ర 2200 నుంచి 1500 బీసీ కాలానికి చెంది ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్రాంజ్ ఏజ్‌కు చెందిన ఆ పాత్రను.. విజిటర్స్ చూసేందుకు మ్యూజియం ఎంట్రెన్స్ వద్ద అమర్చడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.