పెరిగిన చలి.. ములుగు జిల్లా వాసుల ఇబ్బందులు

52చూసినవారు
పెరిగిన చలి.. ములుగు జిల్లా వాసుల ఇబ్బందులు
ములుగు జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. దీంతో ములుగు జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ప్రజలు చలి తీవ్రతతో చలిమంటలు వేసుకుని వెచ్చదనాన్ని పొందుతున్నారు. ములుగు జిల్లాలోని వాజేడు, నూగూరు వెంకటాపురం, ఏటూరునాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం వెంకటాపూర్ మండలాల్లోని ప్రధాన రహదారులను పొగ మంచు కప్పేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు.