ములుగు: సర్వేలో ప్రజలందరూ పాల్గొనాలి: మంత్రి సీతక్క

63చూసినవారు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అందరూ పాల్గొనాలని గురువారం ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క అన్నారు. ఊరూరా ఉత్సవంగా, ఉద్యమంగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని, కుల గణనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని సీతక్క చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో కుల గణన మొదలు పెట్టామని, దేశంలో కుల గణనకు మొదటి అడుగు తెలంగాణలో పడిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్