ములుగు జిల్లా ఏటూరునాగారం పర్యటనలో భాగంగా ఆదివారం పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుర్తుతెలియని వ్యక్తిని ఏటూరునాగారం మండల కాంగ్రెస్ బృందం ద్వారా హుటాహుటిన ఏటూరునాగారం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. బాధితుడిని గుర్తించి కుటుంబ సభ్యులు ఏటూరునాగారం ప్రభుత్వ హాస్పిటల్ కు త్వరగా చేరుకోవాలని వారు కోరారు.