ములుగు జిల్లాలో పోలీసులు అలర్ట్

74చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో ములుగు జిల్లా పోలీసులు అలెర్ట్ అయ్యారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి, మంగపేట సరిహద్దుల్లో పోలీసులు గురువారం ముమ్మరంగా వాహనతనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఎన్ కౌంటర్ లో ఎవరైనా మావోయిస్టులు తప్పించుకున్నారా.? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ సరిహద్దులో అప్రమత్తమయ్యారు.

సంబంధిత పోస్ట్