ఏటూరునాగారం-తాడ్వాయి మధ్య రోడ్డు ప్రమాదం

65చూసినవారు
ఏటూరునాగారం-తాడ్వాయి మధ్య రోడ్డు ప్రమాదం
ములుగు జిల్లా ఏటూరునాగారం తాడ్వాయి మధ్య శుక్రవారం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 163 మధ్యలోని చింతలమోరి సమీపంలో చిన్నబోయినపల్లి వైపు వెళ్తున్న ట్రాక్టర్ ను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ ఇంజిన్, గేర్ బాక్స్ రెండుగా విడిపోయాయి. కార్లోని బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.