గ్యాస్ సిలిండర్‌పై రూ.50, పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.2 పెంపుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరింత భారం వేశారని పేర్కొంది. పుండు మీద కారం చల్లినట్లుగా కేంద్రం తీరు ఉందని మండిపడింది. 'ఇవాళ ముడిచమురు ధర నాలుగేళ్ల కనిష్టానికి చేరింది. అయినా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా కేంద్రం పెంచింది. పైగా ప్రజలపై భారం పడదని డప్పు కొడుతోంది' అని 'X'లో పేర్కొంది.