ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో BJP అంటే బాబు, జగన్, పవన్ అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షర్మిల ట్వీట్ చేశారు. ఏపీలో అన్ని పార్టీలు బీజేపీకి గులాంగిరి చేసేవేనని.. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తోందని షర్మిల పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాలను అసెంబ్లీ బయట నుంచే ఎత్తిచూపుతూ.. ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడుతున్నామన్నారు.