నటుడు ఆయుష్మాన్ ఖురానా సతీమణి, దర్శకురాలు తహీరా కశ్యప్ మరోసారి క్యాన్సర్ బారిన పడ్డారు. సోషల్ మీడియా పోస్టు ద్వారా ఈ విషయాన్ని ఆమె తెలిపారు. భార్య పోస్టుపై ఆయుష్మాన్ స్పందిస్తూ 'మై హీరో' అంటూ ఆమెకు ధైర్యాన్నిచ్చారు. తహీరాకు 2018లో తొలిసారిగా రొమ్ము క్యాన్సర్ సోకింది. మరలా క్యాన్సర్ రావడంతో సోనాలీ బింద్రే, ట్వింకిల్ ఖన్నా తదితర ప్రముఖలతో పాటు నెటిజన్లు, అభిమానులు తహీరా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.