తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు!

74చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చికెన్ ధరలు తగ్గాయి. బర్డ్‌ఫ్లూ, వరుస పండుగలు, వేసవి తదితర కారణాలతో అమ్మకాలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం విజయవాడలో కిలో రూ.310 నుంచి రూ.270కి తగ్గింది. మరికొన్ని ప్రాంతాల్లో రూ.70 వరకు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో గత వారం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.280 ఉంటే, ఇప్పుడు రూ.230కి తగ్గింది. మరికొద్ది రోజులు ధరలు ఇలాగే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందంటూ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్