నర్సంపేట: దేశ శక్తిని ప్రపంచానికి చాటిన మహోన్నతుడు వాజ్ పేయి
వరంగల్ జిల్లా నర్సంపేటలో వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల కో కన్వీనర్ తడుక వినయ్ ఆధ్వర్యంలో శత జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. శతజయంతి సందర్భంగా వాజ్ పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొని ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ లో పండ్ల పంపిణీ చేసి ఘననివాళులు అర్పించారు.