Mar 19, 2025, 05:03 IST/
2025-26 రాష్ట్ర బడ్జెట్ రూ.3,04,965 కోట్లు
Mar 19, 2025, 05:03 IST
తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశ పెట్టారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్ రూ.3,04,965 కోట్లుగా వెల్లడించారు. రెవెన్యూ వ్యయానికి రూ.2,26,982 కోట్లను, మూలధన వ్యయానికి రూ.36,504 కోట్లను కేటాయించారు. వ్యవసాయశాఖకి రూ.24,439 కోట్లు, పశుసంవర్ధకంకు రూ.1,674 కోట్లు కేటాయించారు. పౌరసరఫరాలశాఖకు రూ.5,734 కోట్లు, విద్యా రంరంగానికి రూ.23,108 కోట్లను కేటాయించారు.