సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వరల్డ్ రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. దాదాపు 20 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన అతడు సినిమా.. ప్రపంచంలోనే ఏ సినిమా సాధించలేని ఘనత సాధించింది. 1500 సార్లు టెలికాస్ట్ అయిన సినిమాగా అతడు సరికొత్త ఘనతను సాధించింది. ఈసినిమా స్టార్ మాలో దాదాపు 1500 సార్లు టెలికాస్ట్ చేశారట. ఇంత వరకూ టెలివిజన్ చరిత్రలో ఇలా ఇన్ని సార్లు టెలికాస్ట్ అయిన సినిమా మరొకటి లేదని సినీ అభిమానులు చెప్తున్నారు.