నేడు మెగా వైద్య శిబిరం

72చూసినవారు
నేడు మెగా వైద్య శిబిరం
నల్లబెల్లి మండలం మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో రాంపూర్ గ్రామంలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు స్థానిక వైద్యాధికారి పి. బీ. ఆచార్య తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు, స్థానికులు ఈ ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ శిబిరానికి ప్రత్యేకంగా జనరల్ పిజీషియన్, జనరల్ సర్జన్, ఆర్తోపెడిక్ సర్జన్ అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్