వైద్య రంగంలో కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నర్సంపేట

70చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో వైద్యరంగం పురోగతికి బాటలు పడ్డాయి. పట్టణంలో 50 పడకల సివిల్ ఆసుపత్రిని 1999లో ఏర్పాటు చేశారు. గతేడాది వరకు అన్ని విభాగాలు కలుపుకొని 100 బెడ్స్ ఉన్నాయి. 2023లో టీ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశారు. కాగా గురువారం మంత్రులు ప్రారంభించనున్న జిల్లా ఆసుపత్రిలో 250 పడకలు అందుబాటులోకి రానున్నాయి. 50 సీట్ల మెడికల్ కాలేజీతో ఉమ్మడి జిల్లాలో వైద్య రంగానికి నర్సంపేట కేరాఫ్ గా మారనుంది.

సంబంధిత పోస్ట్