ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నల్లబెల్లిలోని ప్రైవేట్ స్కూళ్ళ పై చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో ఎం ఈ ఓ కార్యాలయంలో ఆనంద్ కి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏ ఐ ఎఫ్ డి ఎస్ డివిజన్ కార్యదర్శి మార్త నాగరాజు మాట్లాడుతూ. నల్లబెల్లిలో ప్రైవేట్ స్కూలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తూ సమ్మర్ క్యాంప్ పేరుమీద విద్యార్థి తల్లిదండ్రుల వద్దనుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాస్ మినహా మిగతా క్లాసులకు క్లాసులు నిర్వహించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా నల్లబెల్లి మండలం లోని ఉన్న ప్రైవేట్ స్కూళ్లకు షరతులు వర్తించవా అని అన్నారు. ఈ విషయంపై సంబంధిత విద్యాశాఖ అధికారి స్పందించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ స్కూళ్ళ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ విజయ్ పాల్గొన్నారు.