పాలకుర్తిలో యధేచ్ఛగా బెల్ట్ షాపుల దందా

606చూసినవారు
పాలకుర్తిలో యధేచ్ఛగా బెల్ట్ షాపుల దందా
పాలకుర్తి మండలం పరిధిలోని గ్రామాల్లో విచ్చల విడిగా బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు. మామూలుగా రాత్రి 11 గంటల తరువాత వైన్స్ మూసి వేస్తారు. కానీ మండల పరిధిలో 24 గంటలు తెరిచే ఉంటున్న బెల్టుషాపులతో భారీగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. దుర్గమ్మ పండుగ, వివాహా శుభాకార్యాల సమయంలో బెల్ట్ షాపుల నిర్వాహకులు తమ దందా కొనసాగిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్