పాలకుర్తి మండలం ఈర వెన్ను గ్రామంలో నూతనంగా నిర్మించిన మస్జిద్ ఏ ఫజల్ హఫీజ్ ను బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మసీదులో ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అల్లా దయవల్ల అంతా క్షేమంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండటంతో పాటు, రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిచి మళ్ళీ సీఎం
కేసీఆర్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.