వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావుపూలే 134వ వర్ధంతిలో దళితరత్న అయిత మల్లేష్, ఎంజేఎఫ్ జిల్లా నాయకులు గారే శ్రీనివాస్ కలిసి గురువారం బస్టాండ్ ఆవరణలో మహాత్మ జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీ అయిత రామచందర్, ఎంజెఎఫ్ మండల కోశాధికారి లక్ష్మణ్, ఇల్లంద భగవాన్, సత్తుపల్లి రాజు, చల్లనరేష్, తదితరులు పాల్గొన్నారు.