రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర, తొర్రూరు మండల కేంద్రాల్లోని బిజెపి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రంగు రాములు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు అన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూనే ఉంటామని, అక్రమ అరెస్టులను ఖండించాలని పిలుపునిచ్చారు.