జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో శనివారం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గిరిజన సంఘాల నేతలు, మృతుని కుటుంబ సభ్యులు. మహిళలతో కలిసి పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే బాధితుడు మానసికంగా ఇబ్బందులకు గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకుని చనిపోయాడని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి భారీగా పోలీసులు బలగాలు చేరుకున్నాయి.