వరంగల్ గొర్రెకుంట క్రాస్ రోడ్డుని అడ్డాగా చేసుకొని తాగుబోతుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. నిఘా పెంచాలని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టింపేలేదని స్థానికులు వాపోతున్నారు. సోమవారం రాత్రి ఓ డబ్బా దుకాణం నిర్వాహకురాలిపై ముగ్గురు వ్యక్తులు మద్యంమత్తులో దుశిస్తూ ' నేనెవరో తెలుసా నీ. నీ అంతు చూస్తా అంటూ' భయభ్రాంతులకు గురి చేశారని బాధితురాలు గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.