కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే రేవూరి, పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు మాట్లాడుతూ. టెక్స్టైల్ పార్క్ లో బిఆర్ఎస్ ప్రభుత్వం బ్రోకర్ల లాగా వ్యవహరించారని, రైతుల భూముల విషయంలో నిలువున ముంచారని తెలిపారు.