ఆత్మకూరు మండల కేంద్రంలో తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్మికులు భిక్షాటనతో ఆదివారం నిరసన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుమారు 10రోజులుగా తాము సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. తమ డిమాండ్లను అంగీకరించే వరకు సమ్మే వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.