అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన పర్వతగిరి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం ముంజాల కుంటకు చెందిన గణేష్ తన వ్యవసాయ భూమికి సమీపంలోని ఓ చెరువు వద్ద అనుమానాస్పద స్థితిలో శనివారం మృతి చెందాడు. మృతుడి తల, కళ్ళు, ముఖంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని పర్వతగిరి సీఐ రాజగోపాల్ చేరుకొని పరిశీలించారు.