Sep 19, 2024, 09:09 IST/
VIDEO: ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని తమ్ముడిపై కత్తితో దాడి చేసిన అన్న
Sep 19, 2024, 09:09 IST
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. కనిగిరి ఎస్సీ కాలనీలో తమ్ముడి ఇజ్రాయిల్ పై అన్న గడ్డం నాగయ్య కత్తితో దాడి చేశాడు. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదనే కారణంతో కత్తితో దాడి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇజ్రాయిల్ తీవ్ర గాయాలవ్వడంతో కుటుంబీకులు స్థానికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.