ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఆదివారం దారుణ ఘటన జరిగింది. భూవివాదం కారణగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో తమ్ముడు అన్నయ్యను కత్తితో పొడిచినట్లు సమాచారం. అనంతరం అతన్ని కుటుంబీకులు సమీప ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.