వీరనారి చాకలి ఐలమ్మ పోరాట జీవితం స్ఫూర్తిదాయకమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. గురువారం హనుమకొండ న్యూ శాయంపేట ఫంక్షన్ వద్ద వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. తెలుగు మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టారని పేర్కొన్నారు.