కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు

80చూసినవారు
కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు
జనగామ జిల్లా చిల్పూర్ మండలం నస్కల్ గ్రామంలో ఆరు బయట ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై సోమవారం వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గ్రామానికి చెందిన కన్నుకటి వేదాం, స్టీఫెన్ రోజు మాదిరిగా ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడికి పాల్పడి గాయపరిచాయి. గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను తప్పించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్