వరంగల్ నగరంలో కల్తీ మాయగాళ్లు ఎక్కువగా డబ్బులు దండుకునేందుకు ఏకంగా భవన నిర్మాణ రంగంలో వాడే ఐరన్ కటింగ్ చేయడానికి ఉపయోగించే పరికరమైన కటింగ్ వీల్ లను, నార్టన్ కంపెనీ ముసుగులో నకిలివి అమ్ముతున్నారనే సమాచారంతో టాస్క్ఫోర్స్ మట్టెవాడ పోలీసులు ఆకస్మిక తనిఖిలు చేపట్టారు. లక్ష్మీసాయి ట్రేడర్స్ లో రూ. 91, 200 విలువ గల 24 బాక్స్ ల నఖిలి కటింగ్ వీల్స్ ని సీజ్ చేశామని మంగళవారం సాయంత్రం పోలీసులు తెలిపారు.