అనుమతి లేకుండా, నిబంధనలు పాటించకుండా అక్రమంగా నిలువ చేసి విక్రయిస్తున్న బాణసంచా దుకాణంపై మంగళవారం రాత్రి వరంగల్ టాస్క్ఫోర్స్ టీం దాడులు చేశారు. వరంగల్ శాకరాసికుంటకు చెందిన లక్ష్మీప్రసన్న, శ్రీమన్నారాయణకు చెందిన ఎస్ఆర్ బేకరి, జనరల్ స్టోర్లో బాణసంచా విక్రయిస్తున్నట్లు సమాచారంతో మిల్స్ కాలనీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి, రూ. 40, 1. 65 లక్షల విలువైన బాంబులను స్వాధీనం చేసుకొన్నారు.