విద్యార్థికి దశ, దిశను చూపించే గురువు పాత్ర సమాజంలో అత్యున్నతమైనదని మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం ఉపాధ్యాయుల దినోత్సవం (సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి) సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. చదువు మాత్రమే అన్ని రకాల అణచివేతలు, నిర్బంధాల నుంచి స్వేచ్ఛను ప్రసాదిస్తుందని మంత్రి అన్నారు. విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని అన్నారు.