AP: బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నదుల్లో ఇసుక తవ్వకాలు ప్రారంభమవుతున్నాయి. దాంతో మరింతగా ఇసుక నిల్వలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే నిల్వ కేంద్రాల్లోని ఇసుక, జలాశయాలు, బ్యారేజీల్లో పూడికగా ఉన్న ఇసుకను తవ్వి విక్రయిస్తున్నారు. వాటికి అదనంగా రీచ్‌ల్లో తవ్వి విక్రయించే ఇసుక జత కానుంది. వరద ప్రభావం లేని 35 రీచ్‌ల్లో తొలత తవ్వకాలు ప్రారంభిస్తారు. ఈ ఇసుకను 50 శాతం ఆన్‌లైన్, 50 శాతం ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తారు.