తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం రోజున 42వ డివిజన్ రంగశాయిపేటలోని బొడ్రాయి సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ జనార్ధన్, మహిళా నాయకురాలు మంతెన సునీత మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేకును కట్ చేసి, పండ్ల పంపిణీ చేశారు.