వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు మంగళవారం నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించారు. విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ తో పాటు మరో అధికారిపై కొంతమంది రైతుల పేరు మీద జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర తహశీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రియజోద్దీన్ తెలిపారు.