హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో బుధవారం వరంగల్టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. కమలాపూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్ లో 1, 78, 000 వేల విలువగల 71 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. మంద శ్రీనివాస్ అనే వ్యక్తి అక్రమ రేషన్ బియ్యం దందాకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.