హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం రాత్రి బస చేశారు. హాస్టల్ లో ఒక రాత్రి బస కార్యక్రమంలో కళాశాలకు కలెక్టర్ రాగా ఎన్సిసి విద్యార్థినులు, బ్యాండ్ బృందం ఘనంగా స్వాగతం పలికారు. తరగతి గదులు, బాలికల డార్మెట్రీ, కిచెన్, స్టోర్ రూమ్, పాఠశాల పరిసరాలను తిరిగి కలెక్టర్ పరిశీలించారు.