నిరుద్యోగుల ఆవేదనను ప్రజలకు తెలియజేయడానికి కొల్లాపూర్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచిన బర్రెలక్కపై దాడిని ఖండించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ గురువారం డిమాండ్ చేశారు. బర్రెలక్కకు భారత విద్యార్థి ఫెడరేషన్ వరంగల్ జిల్లా కమిటీ తరఫున మద్దతుగా నిలుస్తామని అన్నారు.