రూ.100 కోట్ల నిధులతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణం

2321చూసినవారు
రూ.100 కోట్ల నిధులతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణం
హన్మకొండలో రూ. 100 కోట్ల నిధులతో అత్యాధునిక వసతులతో ఆర్టీసీ జిల్లా బస్ స్టేషన్ ను నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తెలిపారు. సోమవారం రాత్రి హనుమకొండ బస్ స్టాండ్ ను అధికారులతో కలిసి వినయ్ భాస్కర్ పరిశీలించారు. ఈనెల 6న మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 35 ప్లాట్ ఫామ్ లు, జి ప్లస్ రెండు అంతస్తులను అత్యాధునిక వసతులతో నిర్మించనున్నట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్