కేయూ దూరవిద్యలో అప్లికేషన్ల గడువు పొడిగింపు

69చూసినవారు
కేయూ దూరవిద్యలో అప్లికేషన్ల గడువు పొడిగింపు
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… సెప్టెంబర్ 30వ తేదీతో దరఖాస్తుల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో అధికారులు గడువు పెంచుతూ ప్రకటన విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 15వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చని తెలిపారు. http://sdlceku.co.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్