ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్ అన్నారు. బుధవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను తీసుకువచ్చిందన్నారు. రాష్ట్రంలోని పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ప్రజల సంక్షేమానికి గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు.